ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజపూర్లో విషాదం చోటుచేసుకొంది. తేజపూర్కు చెందిన రైతు తెడ్డు గంగయ్య, రేండ్లపల్లికి చెందిన మరో రైతు మారుతీ గ్రామ శివారులో కూలి పనులకు వెళ్లారు. అంతలోనే వర్షం కురవడం వల్ల తడవకుండా ఉండేందుకు సమీపంలోని చెట్టు కింద తలదాచుకున్నారు. అంతలోనే చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామకు తరలించారు.
పిడుగుపడి ఇద్దరు రైతులు దుర్మరణం - ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలోని తేజపూర్ గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు రైతులు మృతిచెందారు. గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం కురిసింది. తడవకుండా ఉండేందుకు చెట్టు కిందకు వెళ్లిన సమయంలో పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
పిడుగుపడి ఇద్దరు రైతులు దుర్మరణం