ఈ నెల 14న ఆదిలాబాద్లో జరిగే పార్లమెంట్ సన్నాహక సభను జయప్రదం చేయాలని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. మాజీ మంత్రి జోగు రామన్నతో కలసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కార్యకర్తలతో భేటీ అయ్యారు. 14న సమావేశానికి సుమారు 15వేల మందిని తరలించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
15 వేల మందితో 14న ఆదిలాబాద్ సభ - PEOPLE
పార్లమెంట్ ఎన్నికల కోసం కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నారు తెరాస నేతలు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహిస్తున్న సభలను విజయవంతం చేసేందుకు మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
సభా ఏర్పాట్లపై మంత్రి పర్యవేక్షణ