తెలంగాణ

telangana

ETV Bharat / state

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి వక్ర బుద్ధి... 20 లక్షలు స్వాహా - ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సహచర ఉపాధ్యాయులు కుచ్చుటోపీ పెట్టాడు. 20 లక్షల రూపాయలు స్వాహా చేశాడు.

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి వక్ర బుద్ధి...20 లక్షలు స్వాహా

By

Published : Sep 12, 2019, 10:12 AM IST

ఆదిలాబాద్​లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం బయట పడింది. సదరు ప్రధానోపాధ్యాయుడు తాను పని చేసిన రెండేళ్ల కాలంలో సహచర ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, ఇంక్రిమెంట్లు దాదాపు 20 లక్షలు స్వాహా చేశాడు. ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందాడు. కాగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన పద్మ.... విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు తనకు ఉపాధ్యాయుల జీతభత్యాల వివరాలు ఇవ్వడం లేదని ట్రెజరీ అధికారులకు సమాచారం అందించింది. వారు విచారణ చేపట్టగా ఈ అక్రమ బాగోతం బయటపడింది. ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు.

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి వక్ర బుద్ధి...20 లక్షలు స్వాహా

ABOUT THE AUTHOR

...view details