తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి జిల్లా పరిధిలో రూ. 34 కోట్ల అదనపు భారం - Seed prices

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల విత్తనాల ధరలు పెరగడం రైతులకు భారంగా మారింది. జిల్లాలో పత్తి, వరి, కంది సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. వాటి ధరలు పెరగడంతో జిల్లా రైతులపై రూ.34 కోట్లు అదనంగా భారం పడనుంది. పత్తి విత్తనాలు మినహా ఇతర విత్తనాలు ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. ధరలు ఖరారు చేసిన ప్రభుత్వం రాయితీపై స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

seed prices, adilabad district, seeds susidy
seed prices, adilabad district, seeds susidy

By

Published : Apr 25, 2021, 7:53 PM IST

పత్తి విత్తనాలు మినహా ఇతర విత్తనాలు ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. ధరలు ఖరారు చేసిన ప్రభుత్వం రాయితీపై స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన నెలకొంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు 5.75 లక్షల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది ఆరు లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారుల అంచనా వేశారు. గత సీజన్‌లో విత్తన కొరత రైతులను ఇబ్బందులకు గురిచేసింది. సకాలంలో విత్తనాలు అందకపోవడంతో ఆందోళన చెందారు. ఈ ఏడాది ముందస్తుగా విత్తనాల అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించారు. పంటల వారీగా విత్తనాల అవసరాలు, భారం ఇలా ఉన్నాయి.

కంది :జిల్లాలో కంది సాగు ఏటా పెరుగుతోంది. పత్తి, సోయాలలో అంతర పంటగా దీన్ని సాగు చేస్తారు. గత ఏడాది వరకు కంది విత్తనాలు రాయితీపై ప్రభుత్వం సరఫరా చేసేది. ఈ సీజన్‌లో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే విత్తనాల్లో రైతులు కోరుకునే రకాలు లేకపోవడంతో 60శాతం మంది ప్రైవేట్‌ కంపెనీలపై ఆధారపడుతున్నారు. గతేడాది కంటే విత్తనాల ధర బాగా పెరిగింది. గత ఏడాది కిలో విత్తనం ధర రూ.83 ఉండగా, ఈ ఏడాది రూ.92.70లకు పెంచారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌జీ41 రకం సరఫరా చేస్తుండగా.. రైతులు అజంతా, మున్ని, ఆశ, స్పందన తదితర రకాలను కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు

ఇతర విత్తనాల మాటేమిటి?

జిల్లాలో సాగు చేసే పెసర, మినుములు, వరి తదితర పంటల విత్తనాల రాయితీని ప్రభుత్వం ప్రకటించలేదు. వరి విత్తనాలు ధరలు ఖరారు చేసినా రాయితీపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో పెసర, మినుముల సాగు తగ్గుతోంది. గతంలో పది వేల ఎకరాల్లో సాగు ఉండేది. గత సీజన్‌లో ఐదు వేలకు మించలేదు. రైతులు కోరుకునే రకాలు అందుబాటులో లేకపోవడం, మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో సాగును తగ్గిస్తున్నారు.

సోయా : జిల్లాలో అత్యధికంగా పత్తి సాగవుతుంది. విత్తనాల కోసం రైతులు ప్రైవేట్‌ కంపెనీలపైనే ఆధారపడతారు. జిల్లాలో బీటీ-2 రకం విత్తనాల సాగు ఎక్కువగా ఉంటుంది. వచ్చే సీజన్‌లో 12 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారుల అంచనా. ఈ లెక్కన 20 లక్షలకు పైగా విత్తన సంచులు (450 గ్రాములు) అవసరం ఉంటుంది. అయితే పత్తి పంటకు సంబంధించి పలు కంపెనీలకు చెందిన వందల విత్తన రకాలు అందుబాటులో ఉంటాయి. గత సీజన్‌లో విత్తన సంచి ధర రూ.730 ఉండగా.. వానాకాలం సీజన్‌లో విత్తన ధర రూ.767 నిర్ణయించారు. అంటే సంచికి రూ.37 పెరిగింది. డిమాండ్‌ ఉన్న ఒకటి రెండు రకాలు మాత్రమే ఎమ్మార్పీ ధరతో విక్రయిస్తున్నారు. ఇతర విత్తనాలు ఇంకా తక్కువ ధరకే ఇస్తారు.

పత్తి :పత్తి తరువాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది సోయా పంటనే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర భారీగా పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో సోయా విత్తనం అందుబాటులో లేకపోవడంతో విత్తనాల సరఫరాపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది 1.80 లక్షల ఎకరాల్లో సాగయ్యే వీలుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 85వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. ఏటా సోయా విత్తనాలపై ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ఈ సీజన్‌లో ధర ప్రకటించిన రాయితీపై నిర్ణయం తీసుకోలేదు. పూర్తి ధరతో విత్తనాలు కొనుగోలు చేయాలంటే క్వింటాలుపై రూ.3 వేలకు పైగా భారం పడే వీలుంది.

ఇదీ చూడండి: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి

ABOUT THE AUTHOR

...view details