పిల్లలకు నిర్వహించాల్సిన పరీక్షలను.. ఉపాధ్యాయులకు పెట్టడమేంటని ఆదిలాబాద్ జిల్లా గిరిజన కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో.. టీచర్లు మండిపడ్డారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలను బహిష్కరించి పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు.
'పిల్లల పరీక్షలను.. ఉపాధ్యాయులకు పెట్టడమేంటి' - గిరిజన కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాల
ఆదిలాబాద్ జిల్లా గిరిజన కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలను.. టీచర్లు బహిష్కరించారు. పీవో తీరును నిరసిస్తూ పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.
'పిల్లల పరీక్షలను.. ఉపాధ్యాయులకు పెట్టడమేంటి'
ఉపాధ్యాయ, ఆదివాసీ తుడుం దెబ్బ నాయకులు నిరసనకు మద్దతుగా నిలిచారు. పీవో తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏటీడీవో నాయకుడు ప్రణయ్ కుమార్.. పీవో ఏక పక్ష వైఖరిని తప్పుబట్టారు.
ఇదీ చదవండి:మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్