ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాంలో భార్యపై భర్త దాడి కలకలం రేపింది. భార్య సరిత పై అనుమానం పెంచుకున్న కిష్టు పొలానికి ఒంటరిగా వెళ్లిన ఆమెను వెనుకనుంచి తలపై బండతో బాదాడు. చనిపోయిందనుకుని పారిపోయాడు. పొలం దగ్గరకు వెళ్లిన యజమాని అపస్మారక స్థితిలో ఉన్న సరితను చూసి గ్రామస్థుల సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. తలకు బలమైన గాయం కారణంగా హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించినట్లు కుటుంబీకులు తెలిపారు.
అనుమానంతో భార్య పై దాడి - fields
అనుమానం పెనుభూతంగా మారి భార్యను బండరాయితో మోది చంపాలని చూసిన భర్త... భార్య చనిపోయిందనుకుని పారిపోయాడు కానీ గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో చోటుచేసుకుంది.
అనుమానంతో భార్య పై దాడి.
Last Updated : Aug 26, 2019, 7:46 PM IST