ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లాల్టెకిడిలోని పాలిటెక్నిక్ కళాశాలలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. కనీస వసతులు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఉట్నూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రేఖ నాయక్ విషయం తెలుసుకొని విద్యార్థుల వద్దకు చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో - విద్యార్థుల రాస్తారోకో
పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు లేవంటూ.. విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
విద్యార్థుల రాస్తారోకో