50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - police_vechile_checking_at_adilabad
బెంగళూరు నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 50 లక్షల విలువైన గుట్కాను గుడిహట్నూర్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ 50 లక్షల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు గుడిహట్నూర్ మండల కేంద్రం నగర్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శర్మ దాబా వద్ద కంటేనర్ నిలిపి ఉంచగా పోలీసులు దానిని తనిఖీ చేశారు. 150 సంచుల గుట్కా ప్యాకెట్లు కనిపించగా... వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆదిలాబాద్‌కు చెందిన షమీఉల్లాఖాన్ కొన్ని నెలలుగా బెంగళూరు నుంచి భారీ మొత్తంలో ఆదిలాబాద్‌కు గుట్కా తరలిస్తూ... జిల్లా వ్యాప్తంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ డేవిడ్ తెలిపారు. షమీ ఉల్లాఖాన్, డ్రైవర్ రియాజ్, శర్మదాబా యజమాని అనిల్ శర్మలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.