శనగ రైతులకు బకాయిపడ్డ 70 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. పంట అమ్ముకున్న రైతులకు నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
'శనగ రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి'
రైతుల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రైతన్నల సొమ్ము నెలల తరబడి వాయిదాలు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైతులకు నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోవడం ఏమిటి ??