తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం' - ఉట్నూరులో సొయా విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం

అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు సోయావిత్తనాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Opening of Soya Seed Purchase Center in Utnur
'సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం'

By

Published : Jun 12, 2020, 8:50 PM IST

అధికారులు పల్లెప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో సోయా విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ప్రతి రైతుకు.. రైతుబీమా

అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ అన్నారు. గ్రామాల్లో అందరికీ మంచినీటి సరఫరా అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి రైతు రైతుబీమా చేయించుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయ పనులు మొదలు పెట్టాలని కర్షకులకు.. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

సీజనల్​ వ్యాధులపై అప్రమత్తం

ఆతర్వాత నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పలు శాఖల అధికారులతో చర్చించారు. సీజనల్​ వ్యాధులు విజృంభించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇంటి పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని రేఖా నాయక్​ ప్రజలను కోరారు.

ఇదీ చూడండి:కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details