తెలంగాణ

telangana

ETV Bharat / state

పొచ్చర జలపాతంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య - ముక్క సుదర్శన్

ఆదిలాబాద్​ జిల్లా బోథ్​లోని పొచ్చర జలపాతంలో ఇద్దరూ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పొచ్చర జలపాతంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

By

Published : Aug 21, 2019, 11:35 PM IST


ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతంలో నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ముక్క సుదర్శన్, ప్రమీల అనే వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి కుటుంబ తగాదాలు కారణం అయి ఉండొచ్చని తెలుస్తోంది. 60 ఏళ్లున్న మృతులిద్దరూ ఉదయం జలపాతానికి చేరుకొని అక్కడ చాలా సేపు ప్రకృతి అందాలను వీక్షించారు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో జలపాతంలో దూకినట్లు సమాచారం. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్​ పేర్కొన్నారు.

పొచ్చర జలపాతంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details