తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లాలి' - ఎంపీ సోయం బాపురావు వార్తలు

ఆత్మ నిర్భర్ భారత్​ కార్యక్రమంలో భాగంగా... మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా శ్రేణులకు ఎంపీ సోయం బాపురావు సూచించారు. ఆదిలాబాద్​లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

mp-soyam-bapurao-on-central-government-schemes-at-adilabad
'మోదీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లాలి'

By

Published : Jun 11, 2020, 5:37 PM IST

ఆదిలాబాద్‌ పట్టణం కుమార్‌పేట్‌లో ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమాన్ని భాజపా ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలసి... ప్రతిజ్ఞ చేయించి... ఇంటింటికి ప్రధాని మోదీ సందేశంతో కూడిన లేఖలు అందించారు.

'మోదీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లాలి'

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన సేవలను తెలియజేసేలా కరపత్రాలు సృష్టించినట్లు ఎంపీ తెలిపారు. కొవిడ్​పై పోరాటంలో భాగంగా 20లక్షల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. మోదీ ప్రవేశ పెట్టిని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశమని ఎంపీ వెల్లడించారు.

ఇవీ చూడండి:కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో

ABOUT THE AUTHOR

...view details