ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. ట్రాక్టర్ తగలడంతో వాల్వ్ పగిలి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ సంఘటన జాతీయ రహదారి పక్కనే ఉన్న దసనాపూర్లో ఏరియాలో జరిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీరు ఒక్కసారిగా వంద అడుగులకు విరజిమ్మడంతో ఆ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లలో బంధించారు.
Mission Bhageeratha leak: మిషన్ భగీరథ పైపు లీక్.. వాహనదారుల ఇబ్బందులు
మిషన్ భగీరథ పైపు లీకై పెద్దఎత్తున నీరు వృథా అయింది. రహదారి పక్కనే పైపులు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎగసిపడుతున్న నీటి దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్స్లో బంధించారు.
మిషన్ భగీరథ పైపు లీక్
సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు పైపు లీకేజీని పరిశీలించారు. గంటకు పైగా నీరు వృథాగా రోడ్డుపై వరదలా పారడంతో వాహనాదారులు అవస్థలు పడ్డారు. పట్టణానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ ఇదే కావడంతో లీకేజీని ఆపేందుకు సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.