తెలంగాణ

telangana

ETV Bharat / state

Maoist Leader Katakam Sudarshan Dead : మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి - కటకం సుదర్శన్​

Senior Maoist Leader Katakam Sudarshan Dead : మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్​ అలియాస్​ ఆనంద్​ గుండెపోటుతో మరణించారు. గత నెల 31వ తేదీన ఆయన మృతి చెందారని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Katakam Sudarshan
Katakam Sudarshan

By

Published : Jun 4, 2023, 3:58 PM IST

Maoist Leader Katakam Sudarshan Died Of Heart Attack : మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్​ అలియాస్​ ఆనంద్​ గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్​ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఛత్తీస్​గఢ్​లోని అభుజ్​మడ్​ ప్రాంతంలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆనంద్​ స్వస్థలం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు చేరడంతో.. వారు కన్నీటి పర్యంతమయ్యారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్​ తల్లిదండ్రులు మల్లయ్య, వెంకటమ్మ గతంలోనే మృతి చెందారు. వీరికి ఆరుగురు సంతానం కాగా.. వారిలో సుదర్శన్​ అందరికంటే పెద్దవాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకొనే వారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చేరి డిగ్రీ చదువుతున్నారని వివరించారు. ఆ సమయంలోనే విప్లవ ఉద్యమాల పట్ల ఆకర్షితులై.. మావోయిస్టుల దళంలో చేరారని చెప్పారు. ఆరు నెలలు పాటు సింగరేణి సంస్థలో ఉద్యోగం కూడా చేశారన్నారు. ఆ తర్వాత ఉద్యోగం పూర్తిగా వదిలేసి.. ఉద్యమంలో నిమగ్నమైపోయారు. అక్కడి నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ.. జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్​ జోన్​ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్​ బ్యూరో సభ్యుడిగా పని చేశారు.

Top Maoist Leader From Telangana Katakam Sudarshan : ఉద్యమంలోనే మావోయిస్టు మహిళా నేత లలితక్కతో వివాహం జరిగింది. ఆతర్వాత జరిగిన ఎన్​కౌంటర్​లో ఆమె మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. 1994లో జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలోనే వాంకిడి మండలం సర్కపల్లి ఎన్​కౌంటర్​లో త్రుటిలో తప్పించుకొని.. సుదర్శన్​ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదన్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్​ జిల్లాలో రాడికల్​ యువజన సంఘం, పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో శ్రీశ్రీ హాజరైన సమయంలో సుదర్శన్​ కూడా పాల్గొన్నారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Maoist Leader Katakam Sudarshan Passed Away : గజ్జల గంగారంకు ఈయన సమకాలీకుడని తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత ఈ ఆదివారం వివిధ పార్టీల నాయకులతో పాటు అభిమానులు సుదర్శన్​ ఇంటికి తరలివచ్చి.. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుదర్శన్​ అమర్​ రహే అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ వచ్చేనెల ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆయన మరణంతో తను పుట్టిన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details