మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గంగపుత్ర ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి బోలాశంకరుడిని దర్శనం చేసుకుంటున్నారు. పట్టణ శివారులోని రాజరాజేశ్వరాలయం, రాంనగర్లోని శివాలయం భక్తులతో సందడిగా మారాయి. శివలింగాలకు పాలాభిషేకం చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీవారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శైవక్షేత్రాలకు భక్తజనం - shiva
శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలన్ని భక్తజనంతో నిండిపోయాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
అలంకార ప్రాయుడైన శివుడు