ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో కొలువు దీరిన 38 అడుగుల మహా శక్తి గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామివారి పక్కన రాముడు, దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. గత నలబై ఏళ్లుగా కుమార్ జనతా మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠిస్తున్న లంబోదరుడు ఏటా ఓ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇక్కడి వినాయకుడిని దర్శించుకుంటున్న భక్తులు తమ చరవాణుల్లో గణేశ్‌ను బందిస్తూ మురిసిపోతున్నారు.
గణనాథుడి పక్కన రాముడు, దుర్గామాత - గణపతి విగ్రహం
గణేశ్ నవరాత్రుల్లో భాగంగా రాష్ట్రంలో గ్రామ గ్రామాన పలు రూపాలతో గణనాథులు కొలువుదీరారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో 38 అడుగుల మహా శక్తి గణేశ్ ప్రతిష్ఠించారు.
గణనాథుడి పక్కన రాముడు, దుర్గామాత