తెలంగాణ

telangana

ETV Bharat / state

బయటకు రావడానికి జంకుతున్న జనం

ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలితీవ్రత కొనసాగుతోంది. పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.పెన్‌గంగా, ప్రాణహిత నదీపరివాహాక ప్రాంతాల్లో పొగమంచు కారణంగా బారెడు పొద్దెక్కినా చలి తగ్గడంలేదు.

low-temperature-continues-in-the-joint-adilabad
బయటకు రావడానికి జంకుతున్న జనం

By

Published : Dec 24, 2020, 6:52 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను చలిపులి వణికిస్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న ఈదురుగాలులకు తోడు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

మంచు కారణంగా..

కుమురంభీం జిల్లా గిన్నెధరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.8 సెల్సియస్‌కు పడిపోగా.. ఆదిలాబాద్​లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7సెల్సియస్‌గా నమోదయ్యాయి. పెన్‌గంగా, ప్రాణహిత నదీపరివాహాక ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పొగ మంచు కారణంగా బారెడు పొద్దెక్కినా చలి తగ్గడంలేదు. దీంతో వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. పలు చోట్ల ప్రజలు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు.

ఇదీ చదవండి :భయపడొద్దు.. అప్రమత్తంగా ఉండండి : డాక్టర్ శ్రీనివాస్

ABOUT THE AUTHOR

...view details