తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!

ఖమ్మంలో నివాసముండే విశ్రాంత సీఐ చాట్ల విజయ్​కుమార్​.. తన తల్లి మరణవార్త విని కుంగిపోయాడు. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఆదిలాబాద్​ బయల్దేరాడు. వరంగల్​ అర్బన్​ జిల్లా పెంచికల్​పేట సమీపంలో తాను ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనగా.. అక్కడికక్కడే విజయ్​కుమార్ దంపతులు మృతిచెందారు.

lorry hit car- accident in warangal
తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!

By

Published : Feb 16, 2020, 10:34 AM IST

తల్లి మరణవార్త వినగానే కుమారుడు చలించిపోయాడు. ఆఖరి చూపు చూసేందుకు ఖమ్మం నుంచి ఆదిలాబాద్​ బయల్దేరాడు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆ కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం వరంగల్​ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్​పేట సమీపంలో జరిగింది.

ఆదిలాబాద్​ జిల్లా టీచర్స్​ కాలనీలో తల్లి శవం ఉండగానే.. సోదరుడు, అతని భార్య మరణించిన వార్త.. ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చిందని సుదర్శన్ వాపోయారు. తల్లితో పాటే విజయ్​కుమార్​ దంపతుల అంత్యక్రియలు తానే నిర్వహించనున్నట్లు సుదర్శన్ తెలిపారు.

తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!

పెంచికల్​పేట సమీపంలో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. చాట్ల విజయ్​కుమార్- సునీత దంపతులు అక్కడికక్కడే మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ వర్ధన్​రెడ్డిలు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విజయ్​కుమార్ విశ్రాంత సీఐగా గుర్తించారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!

ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా

ABOUT THE AUTHOR

...view details