తెలంగాణ

telangana

ETV Bharat / state

గోడం నగేశ్​ కోసం కోనేరు కోనప్ప ప్రచారం - mp candidate

ఆదిలాబాద్​ తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రచారం నిర్వహించారు. కోనప్ప తనయుడు వంశీ కూడా పాల్గొని నగేశ్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రచారం నిర్వహిస్తున్న కోనప్ప కుమారుడు

By

Published : Apr 4, 2019, 10:31 AM IST

ప్రచారం నిర్వహిస్తున్న కోనప్ప కుమారుడు
లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ తెరాస అభ్యర్థి గోడం నగేశ్​​ను గెలిపించేందుకు తెరాస శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చుట్టు పక్కల మండలాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా... కోనప్ప తనయుడు వంశీ కాగజ్ నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. వ్యాపార సముదాయాలలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని కారు గుర్తుకు ఓటు వేసి గోడం నగేశ్​​ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాగజ్​నగర్ పురపాలక సంఘం ఛైర్ పర్సన్, పలువురు కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details