తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పచెట్టే దైవం.. తునికి పండ్లే నైవేద్యం! - గంగాజలం కోసం పాదయాత్ర

నాగోబా జాతరకు ఆదిలాబాద్​ జిల్లా సిద్ధమవుతోంది. ఇప్పటికే గంగాజలం కోసం మెస్రం వంశస్థులు పాదయాత్ర చేపట్టగా... అది కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా జైనూరు మండలానికి చేరుకుంది. వారి సంప్రదాయం ప్రకారం గౌరి గ్రామ శివారులో... ఇప్ప చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

keslapur nagoba fest in  adilabad latest news
keslapur nagoba fest in adilabad latest news

By

Published : Jan 28, 2021, 6:56 AM IST

దిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం జాతరకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మెస్రం వంశస్థులు గంగాజలం కోసం నాగోబా ఆలయం నుంచి చేపట్టిన పాదయాత్ర బుధవారం కుమురం భీం జిల్లా జైనూరు మండలంలో సాగింది. ఆ మండలంలోని గౌరి గ్రామ శివారులోని వనం కింద మెస్రం వంశస్థులు బస చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఇప్ప, మారేడు, మర్రి, తునికి చెట్లన్నీ ఒకే చోట ఉండటం చాలా అరుదు. ఆ చెట్లన్నీ గౌరి గ్రామ శివారులో ఉన్నాయి. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం వారు.. ఇప్ప చెట్టును భీం దేవుడిగా కొలుస్తూ మారేడు చెట్టు బిల్వ పత్రాలను, తునికి చెట్టు పండ్లను మర్రి ఆకుల్లో నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆ చెట్ల కిందే సహపంక్తి భోజనాలు చేశారు.

ఇదీ చూడండి:అఖిల భారత ఉద్యాన వన ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details