కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఎంసీ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆదిలాబాద్ రిమ్స్ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ఔట్ పేషంట్ల విభాగం ఎదుట నినాదాలు చేశారు. జూనియర్ వైద్యులకు ఐఎంఏ జిల్లా శాఖ మద్దతు ప్రకటించింది. అనంతరం అక్కడే బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు.
రిమ్స్‌లో జూడాల ఆందోళన.. - rims
ఆదిలాబాద్ రిమ్స్ వైద్యకళాశాలలో జూడాలు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి ఔట్ పేషంట్ల విభాగం ఎదుట ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జూడాల ఆందోళన