ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈటీవీ భారత్‌లో ప్రసారం చేసిన కథనాలకు ఇంటర్ బోర్డు అధికారులు స్పందించారు. వారి ఆదేశాలతో జిల్లా మాధ్యమిక విద్యా అధికారి దసురు నాయక్ ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించారు.
అధికారులు స్పందించారు - college
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలపై ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. వెంటనే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.
స్పందించిన అధికారులు
డెస్కులు లేక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు అవస్థలు పడుతున్న విషయం గమనించి ఏర్పాట్లు పూర్తి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ని ఆదేశించారు. రేపటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.
ఇదీ చదవండి: 'కలెక్టర్ వార్నింగ్..!'
Last Updated : Feb 28, 2019, 1:17 PM IST