ఆదివాసీ ప్రజలపై దాడులు చేస్తున్న అటవీ అధికారులకు బంగారు పతకాలు ఇచ్చి ప్రభుత్వం గౌరవిస్తోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆగ్రహించారు. పొట్ట కూటి కోసం పొడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిపుత్రులను జైళ్లోకి పంపిస్తోన్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీలపై జులుం ప్రదర్శిస్తున్నందునే అటవీ హక్కు పత్రాలు కలిగిన భూముల్లో హరితహారం కింద నాటిన మొక్కలు తీసివేయాలని చెప్పినట్లు స్పష్టం చేశారు. ఆదివాసీలంతా ఐక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు.
'ఆదివాసీలపై దాడులు చేసేవారికి బంగారు పతకాలా? ' - అటవీ అధికారులకు బంగారు పతకాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీల అస్తిత్వ పోరాట సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ సోయం గిరిజనుల పట్ల ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
మాపై దాడులు చేసిన వారికి బంగారు పతకాలు ఇస్తారా ? సోయం బాపూరావు