తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్‌.. పరారీలో తెరాస కౌన్సిలర్ - crime news in adilabad

ఓ యువకుడిపై 10మంది కలిసి దాడికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్​లో చోటుచేసుకుంది. పాతకక్షల కారణంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్.. తన అనుచరులతో కలిసి దాడికి దిగినట్లు బాధితుడు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Gangwar in adilabad
ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్

By

Published : Jun 4, 2020, 10:16 PM IST

పాతకక్షల కారణంగా ఓ యువకుడిపై తెరాసకు చెందిన వార్డు కౌన్సిలర్​ తొమ్మిది మందితో కలసి దాడికి పాల్పడటం ఆదిలాబాద్‌లో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌ కాలనీకి చెందిన సిల్వర్‌ శ్రీనివాస్‌ను తెరాసకు చెందిన వార్డ్​ కౌన్సిలర్​ ఉష్కం రఘుపతి ఆయన అనుచరులు దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులతో కలిసి బాధితుడి ఇంటికి వచ్చి.. పట్టణ శివారులోకి తీసుకెళ్లి దాడికి దిగారు. ఈ విషయమై వన్‌టౌన్‌ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. రియల్టర్‌గా పేరొందిన తెరాస వార్డు కౌన్సిలర్​ రఘుపతిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. తాజా గొడవలో ఆయనతో పాటు మిగిలినవారంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్

ABOUT THE AUTHOR

...view details