తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ధర్నా - వ్యవసాయ కార్మిక సంఘం

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేసి రైతుల్ని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి కోరారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ధర్నా

By

Published : Sep 6, 2019, 5:58 PM IST

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడికి గాను 50శాతం సాయం అందించాలన్న స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి కోరారు. పెండింగ్‌లో ఉన్న రైతు బంధు డబ్బును వెంటనే పట్టాదారు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. కూలీలకు రూ.18వేల కనీసవేతన చట్టం అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌చేశారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ధర్నా

ABOUT THE AUTHOR

...view details