ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రైతులకు అమ్మేందుకు తరలిస్తున్న నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. జైనూర్ నుంచి తన సొంత కారులో నకిలీ పత్తి విత్తనాలను మదర్ఖాన్ తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఉట్నూర్ మండల కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వాహనాన్ని తనిఖీలు చేశారు.
ఉట్నూర్‌లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
రైతులకు అమ్మేందుకు ఆదిలాబాద్ జైనూర్ నుంచి కారులో తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను ఉట్నూర్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ. 70 వేల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
ఉట్నూర్‌లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
అందులో రూ.70 వేల విలువైన నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. అక్రమంగా నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉట్నూర్ ఎస్సై సుబ్బారావు తెలిపారు.
ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!