ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయిసామత్ డిగ్రీ కళాశాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటు విలువ - ఆవశ్యకత కార్యక్రమం నిర్వహించారు. తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటామని స్థానిక యువత ప్రతిజ్ఞ చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలందరూ 100 శాతం ఓటు వేసేలా చూస్తామని అన్నారు.
ప్రలోభాలకు లొంగకుండా ఓటేస్తామని యువత ప్రతిజ్ఞ - ఓటరు అవగాహన
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈనాడు ఈటీవీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ ఇచ్చోడలోని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటు విలువ ఆవశ్యకత కార్యక్రమంలో యువత పాల్గొని కచ్చితంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
యువత ప్రతిజ్ఞ