తెలంగాణ

telangana

ETV Bharat / state

నిప్పుల కొలిమిగా మారిన ఉమ్మడి ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భానుడు ప్రచండ రూపం దాల్చాడు. నిండు వేసవిలో నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. పగటి పూట అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అగ్గి కురిపిస్తున్న భానుడు
అగ్గి కురిపిస్తున్న భానుడు

By

Published : May 27, 2020, 6:28 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.5గా నమోదైంది. నిన్న ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు వ్యక్తులు వడదెబ్బతో మృతిచెందడం విషాదం నింపింది. మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చే హజీపూర్‌ మండలం నంనూర్‌లో ఏనుగు చొక్కారెడ్డి, జైపూర్‌ మండలం శివ్వారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం దేవుగూడలో జన్నారం మండలానికి చెందిన సోయం రత్నం వడదెబ్బతో మృతిచెందారు.

వడగాలులతో భయాందోళనలో ప్రజలు..

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రంగా వడగాల్పులు వీస్తుండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతోన్న ఎండ తీవ్రత సాయంత్రం ఏడు దాటినా సేగ కొనసాగుతోంది. భరించలేని ఉక్కపోత ఉంటోంది. కూలర్లు, ఏసీలు వినియోగించినా వేడి తీవ్రత తగ్గక ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. కూలర్లు, ఏసీలు లేని సామాన్య జనం, పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఇవీ చూడండి : ఆర్టీసీ బస్సులోనే గర్భిణీ ప్రసవం

ABOUT THE AUTHOR

...view details