రాష్ట్రంలో హరితహారం కింద 85 శాతం మొక్కలను కాపాడాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గతంలో నాటిన మొక్కల్లో కేవలం 50శాతమే బతికాయని తెలిపారు. ఆదిలాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పెన్‌గంగా బ్యారేజీ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పంచాయతీరాజ్ చట్టం బలోపేతంలో భాగంగా గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. చట్టాలు చదవిన తరువాతే బల్దియాల్లో కౌన్సిలర్లుగా పోటీచేయాలని స్పష్టం చేశారు.
మొక్కల పెంపకం నిర్లక్ష్యం చేయోద్దు
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేయోద్దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పెన్‌గంగా బ్యారేజీ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
నిర్లక్ష్యం చేయోద్దు