తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆందోళన

ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని.. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

CPI Protest in Adilabad Collectorate
ప్రజాసమస్యలపై.. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

By

Published : Oct 19, 2020, 4:58 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట.. సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎన్నికల సమయంలో కేసీఆర్​ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాల వైఖరిని సీపీఐ నాయకులు దుయ్యబట్టారు. ఆయా డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కలవేణి శంకర్‌ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఆ హామిని నెరవేర్చలేదని ఆరోపించారు. అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details