ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం జైత్రం తండా పంచాయతీ పరిధిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పంచాయతీ పరిధిలో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల పరిశీలన సమయంలో ప్రస్తుత సర్పంచ్ భర్త రాఠోడ్ పరశురాం, మాజీ సర్పంచ్ భర్త రాఠోడ్ గజానంద్‌ల మధ్య గొడవ జరిగింది. ఘటనలో రాఠోడ్ గజానంద్ మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన మాజీ సర్పంచ్ వర్గీయులు ప్రస్తుత సర్పంచ్ వర్గానికి చెందిన వారి ఇళ్లకు, ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం వల్ల పోలీసు బలగాలు అక్కడకు చేరుకొని ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టారు.
జైత్రామ్ తండాలో ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ భర్త మృతి - ఆదిలాబాద్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో మాజీ సర్పంచ్ భర్త మృతి చెందారు. ఆగ్రహించిన మాజీ సర్పంచ్ వర్గం ప్రస్తుత సర్పంచ్ వర్గానికి చెందిన వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు.
జైత్రామ్ తండాలో ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ భర్త మృతి