Chanaka Korata project: నీటిపారుదల శాఖ చనాకా-కొరాటా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతుల కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ.. ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కరవు ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు దిగువ పెన్‌గంగపై చనాకా- కొరాటా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇప్పుడిది వెట్‌రన్‌కు సిద్ధమయింది. వచ్చే నెలాఖరులోపు పంపుహౌసు నుంచి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసి పరీక్షించనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్, బేల, భీంపూర్ మండలాల పరిధిలో 37వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పనులన్నీ పూర్తి కావచ్చినా ఆయకట్టుకు సాగునీటిని చేర్చే ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం నేటికీ ప్రారంభించలేదు. నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ అంతా పూర్తయింది. ప్రభుత్వం నుంచి పరిహారం రావడం ఒక్కటే మిగిలి ఉంది.