రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న అర్లి(టీ) గ్రామానికి అతి సమీపంలో ఉంది వడూర్ గ్రామం. ఊరు చుట్టూ ఓ వైపు అటవీ, మరోవైపు పెన్‌గంగ నది ఆనుకుని ఉంది. మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఉత్తరాది శీతగాలులు తొలుత గ్రామాన్ని తాకాయి. దీనితో అక్కడ చలి తీవ్రత మరీ ఎక్కువైందని గ్రామస్థులు అంటున్నారు.
ఇక్కడ గత మూడు నెలలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, సాయంత్రం నుంచే పొగమంచు ఊరిని కమ్మేస్తుండటంతో గ్రామస్థులంతా చలిమంటలు కాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.