ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సప్తాహా కార్యక్రమంలో భాగంగా భాజపా గిరిజన మోర్చా నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎం ఫర్ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందూర్ ప్రభాకర్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు.. దేశంలోని విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నేతలు - ఎం ఫర్ సేవ
ఆదిలాబాద్ జిల్లాలోని ఎం ఫర్ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు భాజపా గిరిజన మోర్చా నాయకులు పండ్లు పంపిణీ చేశారు.
'విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు'