ఆదిలాబాద్ మండల కేంద్రంలో కలుషిత పానీపూరి తిని అస్వస్థతకు గురైన సంఘటన మరువకముందే.. ఏజెన్సీలో కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లో ఓ కుటుంబం సంప్రదాయ పూజలు నిర్వహించుకున్నారు. పూజలు, భజన కార్యక్రమాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాత్రి సహపంక్తి భోజనం చేశారు. ఉదయం మళ్లీ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారికి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు.
కలుషిత ఆహారం తిని 22 మందికి అస్వస్థత
ఆదిలాబాద్ ఏజెన్సీలో కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనానంతరం వాంతులు, విరోచనాలు చేసుకోవడం వల్ల.. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
భోజనానంతరం 22 మంది (ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు) వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. స్థానికులు వెంటనే వారిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఉట్నూర్ ఆర్డీఓ వినోద్‌కుమార్, ఉట్నూర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ