తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి - ఎద్దులు

ఆదిలాబాద్​ జిల్లాలో విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మరణించాయి. రైతు ఎడ్లబండితో వెళ్తుండగా కంచె లేని విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి.

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి

By

Published : Jul 31, 2019, 2:42 PM IST

ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్​లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన రాథోడ్ సంతోశ్​ పొలానికి ఎద్దుల బండితో వెళ్తుండగా పక్కన ఉన్న కంచె లేని విద్యుత్ తీగలు తగిలి రెండు ఎద్దులు అక్కడికక్కడే మరణించాయి. సంతోశ్​ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్లముందే ఎద్దులు చనిపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతు కన్నీరుమున్నీరయ్యాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్థులు ఆరోపించారు.

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి

ABOUT THE AUTHOR

...view details