'నేరాన్ని అంగీకరించినా... వాదనలే జరుగుతాయి...!'
రాష్ట్రంలోసంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్యోదంతం కేసును ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మగ్ధుంను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక కోర్టుకు తరలించారు. కోర్టు ద్వారా నిన్న ప్రత్యేకంగా నియమితులైన న్యాయవాది రహీం... ఈరోజు నిందితుల తరపున వకాల్తా దాఖలు చేయగా... విచారణ రేపటికి వాయిదా పడింది. గురువారం రోజున కోర్టులో నిందితులు ఒకవేళ నేరాన్ని అంగీకరించినప్పటికీ... వెంటనే శిక్షవేసే అవకాశం కంటే, వాదనలు జరగడానికే అవకాశంఉందంటున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి...
ADILABAD SPECIAL COURT HEARING UPDATAES IN SAMATHA CASE