స్తిరాస్థి వ్యాపారులు చేసే అక్రమ లే-అవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఆదిలాబాద్ సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఇదివరకు చేసిన లే అవుట్లను... ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్తిరాస్థి వ్యాపారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్రమ లే అవుట్ల కారణంగా చాలా మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్న ఆమె... ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాటిని సరిచేసుకోవాలని స్పష్టం చేశారు. లే అవుట్లకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు, స్తిరాస్థి వ్యాపారుల అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు.
అక్రమ లే అవుట్లను అనుమతించం: సంయుక్త కలెక్టర్ - Illegal_Layouts_Review
ఆదిలాబాద్లో స్తిరాస్థి వ్యాపారులతో సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి సమావేశమయ్యారు. అక్రమ లే అవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.
అక్రమ లే అవుట్లను అనుమతించం: సంయుక్త కలెక్టర్