తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత నిందితుల తరఫున వాదించొద్దని తీర్మానం - SAMATHA CASE LATEST NEWS

సమత హత్యాచార కేసులో నిందితుల తరఫున ఎవ్వరూ వాదించకూడదని ఆదిలాబాద్​ బార్​ అసోసియేషన్​ తీర్మానించింది. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

ADILABAD BAR ASSOCIATION DECIDED TO NOT ARGUE FOR CULPRITS OF SAMATHA CASE
ADILABAD BAR ASSOCIATION DECIDED TO NOT ARGUE FOR CULPRITS OF SAMATHA CASE

By

Published : Dec 11, 2019, 9:20 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ సమీపంలో సమతపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుల తరఫున వాదించకూడదని ఆదిలాబాద్​ జిల్లా బార్​ అసోసియేషన్​ తీర్మానించింది. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్‌ పొడగించింది. ఆదిలాబాద్‌లోనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేస్తూ... హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిణిని ప్రత్యేక న్యాయమూర్తిగా నియమించింది. ఈ క్రమంలో నిందితులకు సత్వర శిక్ష పడేట్లు చూడాలని బార్​ అసోసియేషన్​ విజ్ఞప్తి చేసింది.

నిందితుల తరఫున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ తీర్మానం

ABOUT THE AUTHOR

...view details