గులాబ్ తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడ వద్ద లోలెవల్ వంతెనపై వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొంతసేపటి తర్వాత వరద ప్రవాహం కొద్దిగా తగ్గిందని భావించి పోలీసులు వారించినా కొంతమంది ధైర్యం చేసి వాగును దాటే యత్నం చేశారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై దాటుతుండగా.. అదుపు తప్పి కింద పడిపోయాడు.
వాగుదాటుతుండగా బైక్‌తో సహా పడిపోయాడు.. ఆ సమయంలో అదే కాపాడింది - వాగులో పడిపోయిన వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు
గులాబ్ తుపాను ప్రభావంతో ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణం సమీపంలోని బంగారుగూడ వద్ద లోలెవల్ వంతెనపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
bike skid
ప్రాణాలు కాపాడుకోవడానికి బండి హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకున్నాడు. వంతెన నుంచి కిందికి జారిపోయేలా కనిపించినా పట్టు వదల్లేదు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు.
ఇదీ చూడండి:Heavy Rain in Telangana : తెలంగాణ అతలాకుతలం.. హైదరాబాద్ జలమయం... నేడూ భారీ వర్షాలు