భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ (Bhavina Pate) మరో అద్భుత ప్రదర్శన చేసింది. పారాలింపిక్స్ (Paralympics) టీటీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో వరల్డ్ నంబర్ త్రీ ప్లేయర్, చైనా ప్యాడ్లర్ మియావో జాంగ్‌పై 3-2తో గెలుపొందింది.
శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో గెలుపొందింది భవీనా. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ సీడ్, చైనా ప్లేయర్ యింగ్ ఝోతో తలపడనుంది.