తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​కు తుపాను గండం.. ఆ షెడ్యూల్​లో మార్పు - surfing schedule olympics

టోక్యో ఒలింపిక్స్​కు తుపాను గండం తప్పేట్లు లేదు. విశ్వక్రీడల్లో భాగమైన సర్ఫింగ్ ఆట షెడ్యూల్​ను ఇప్పటికే మార్చారు నిర్వాహకులు. బుధవారం జరగాల్సిన మ్యాచ్​ను మంగళవారానికి మార్చారు.

tokyo olympics 2020
టోక్యో ఒలింపిక్స్ 2020

By

Published : Jul 26, 2021, 7:32 PM IST

కరోనా భయాల మధ్య సాగుతున్న ఒలింపిక్స్​కు మరో ముప్పు పొంచి ఉంది. జపాన్​లో నెపార్తక్​ తుపాను ఈ నెల 27న తీరం దాటే అవకాశమున్నట్టు ఆ దేశ వాతావరణశాఖ వెల్లడించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్​లో అరంగేట్ర క్రీడ సర్ఫింగ్​ షెడ్యూల్​లో నిర్వాహకులు మార్పులు చేయక తప్పలేదు.

నెపార్తక్​.. తూర్పు జపాను వద్ద పెసిఫిక్​ సముద్రంవైపు మంగళవారం తీరం దాటే అవకాశముంది. దీంతో తీవ్రస్థాయిలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. బుధవారం నాటికి పరిస్థితి మరింత ఉద్ధృతంగా మారే సూచనలు ఉన్నాయి. అందువల్ల బుధవారం జరగాల్సిన సర్ఫింగ్​ హీట్స్​.. మంగళవారానికి మార్చారు నిర్వాహకులు.

వాతవరణ మార్పుల ప్రభావం ఈసారి ముందుగా ఆర్చరీపై పడింది. మంగళవారం మధ్వాహ్నం జరగాల్సిన మ్యాచ్​లను బుధవారం, గురువారానికి వాయిదా వేశారు. ​

2008 బీజింగ్ ఒలింపిక్స్​లోనూ వాతవరణ సమస్యల కారణంగా అనేకమార్లు ఆటలను ఒక గంట ఆలస్యంగా నిర్వహించారు.

ఇదీ చదవండి:స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం

ABOUT THE AUTHOR

...view details