ప్రపంచ రెండో సీడ్ ప్లేయర్ నవోమి ఒసాకా ఒలింపిక్స్ నుంచి ఓటమితో వైదొలిగింది. మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వండ్రౌసోవా 6-1, 6-4 తేడాతో విజయం సాధించింది.
తొలి సెట్లో కేవలం ఒకే ఒకే గేమ్‌ను గెలుచుకున్న ఒసాకా.. రెండో సెట్లో కాస్త ప్రతిఘటించింది. ప్రపంచ స్టార్ ప్లేయర్ అయిన నవోమి.. వరుస సెట్లలో ఓడిపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయమే.