టోక్యో ఒలింపిక్స్ మరో ఆరు రోజుల్లో పూర్తికానున్నాయి. కానీ ఇప్పటివరకు భారత్ కేవలం రెండు పతకాలే నెగ్గింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తొలి పతకం(రజతం) సాధించగా.. షట్లర్ పీవీ సింధు కాంస్యం నెగ్గింది. ఇప్పుడు టోర్నీ 11వ రోజుకు చేరుకుంది. మంగళవారం(ఆగస్టు 3) మరికొందరు భారత అథ్లెట్లు పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరి ప్రదర్శనతోనైనా భారత్‌కు పతకాల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.
హాకీపై భారీ ఆశలు
ఈ విశ్వక్రీడల్లో మంగళవారం జరగబోయే పోటీల్లో భారత హాకీ పురుషుల జట్టు ఆడబోయే సెమీస్ కోసం యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన మన జట్టు.. 41ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్ సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఫైనల్‌కు చేరి రికార్డు సాధించినట్లవుతుంది. చివరిసారిగా 1980లో పురుషుల హాకీ జట్టు స్వర్ణం దక్కించుకుంది.
టోక్యో ఒలింపిక్స్ 11వ రోజున(ఆగస్టు 3) భారత్ పోటీలు
హాకీ
భారతకాలమానం ప్రకారం ఉదయం 7గంటలకు సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది