ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే రజతంతో మెరిశాడు భారత రెజ్లర్ రవి దహియా. గొప్పగా పోరాడినప్పటికీ 57 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్లో గెలవలేకపోయాడు. దీంతో అఖండ భారతావని బాధపడింది. ఈ ఓటమిపై భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ స్పందించాడు.
రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) రెజ్లర్ జవుర్ యుగెవ్తో జరిగిన ఫైనల్‌ను టీవీలో చూశాడు సుశీల్. మ్యాచ్‌లో రవి దహియా ఓడిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వస్తుందని ఆశించాడు. ఈ విషయాన్ని తిహార్ జైలు అధికారులు వెల్లడించారు.
మల్లయోధుడు సాగర్ ధంకర్ హత్యకేసులో భాగంగా తిహర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు సుశీల్. మే 4న దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద ఈ హత్య జరిగింది. విశ్వక్రీడల్లో భారత్ తరఫున రెండు పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్ సుశీల్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల్, 2012 లండన్ గేమ్స్‌లో వెండితో మెరిశాడు.