ప్రముఖ సైకత శిల్పి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) తనదైన రీతిలో భారత పారా అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా పూరీ బీచ్‌లో ఆటగాళ్లకు మద్దతుగా అద్భుతమైన సైకత శిల్పాన్ని నిర్మించారు. టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2020) పాల్గొంటున్న భారత క్రీడాకారుల కోసం ప్రార్థించాలని పేర్కొన్నారు. ఈ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
Tokyo Paralympics 2020: భారత పారా అథ్లెట్లకు 'సైకత' శుభాకాంక్షలు
ఒడిశా పూరీ బీచ్‌లో భారత పారా అథ్లెట్లకు తన సైకత శిల్పంతో మద్దతు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik). వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2020) భారత్ గెలుపుకోసం ప్రార్థించాలని పేర్కొన్నారు.
మంగళవారం (ఆగస్టు 23) నుంచి టోక్యో వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచదేశాల నుంచి 4500 అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. భారత్ నుంచి ఈ సారి అత్యధికంగా 54 మంది ఆటగాళ్లు విశ్వ క్రీడా సంబరంలో పాల్గొననున్నారు. ఈ దఫా మన అథ్లెట్లు 15 పతకాలు సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు సహా స్టార్ అథ్లెట్లు చాలామందే ఉన్నారు.
ఇదీ చదవండి:Tokyo Paralympics: విశ్వ క్రీడా సంబరం మళ్లీ మొదలైంది