టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కక్ త్రోయర్ వినోద్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పోటీల్లో అతడు సాధించిన కాంస్య పతకం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయింది. అతడు డిసేబిలిటీ క్లాసిఫికేషన్ రీఎసెస్మెంట్లో అర్హత సాధించలేకపోవడమే ఇందుకు కారణం.
ఆదివారం జరిగిన పోటీల్లో ఎఫ్52 కేటగిరీలో పాల్గొన్న వినోద్(41).. 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. అయితే.. ఎఫ్52 కేటగిరీలో వినోద్(Vinod Kumar Paralympics) ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారు కొందరు పోటీదారులు. వాస్తవానికి.. ఆగస్టు 22నే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తైంది. అయినప్పటికీ పోటీదారులు అతడి ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడు సాధించిన పతకాన్ని హోల్డ్‌లో ఉంచారు. డిసేబిలిటీ క్లాసిఫికేషన్ రీఎసెస్‌మెంట్ నిర్వహించారు. ఇందులో అతడు అర్హత సాధించలేకపోయాడు.
ఎఫ్52 కేటగిరీ అంటే..