ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ మరోసారి స్వర్ణం సాధించింది. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్డా అద్వితీయ ప్రదర్శనతో స్వర్ణం లభించింది. 130 కోట్ల భారతీయుల మనస్సు ఉప్పొంగుతుండగా చోప్డా పతకం స్వీకరించాడు. చోప్రా స్వస్థలం హరియాణా. తాజా ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు రాగా అందులో మూడు హరియాణా క్రీడాకారులే సాధంచడం విశేషం. చోప్డా స్వర్ణంతో, కుస్తీలో రవికుమార్ దహియా రజతంతో, బజరంగ్ పునియా కాంస్యం గెలుపొందారు. చిన్న రాష్ట్రమైన హరియాణా క్రీడల్లో దేశంలో అగ్రభాగాన నిలవడం వెనుక గల కారణాలేంటంటే..
ప్రభుత్వ క్రీడా విధానం
హరియాణా ప్రభుత్వ క్రీడాల విధానంతో మారుమూల ప్రాంతాల్లోనూ క్రీడలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు ఏర్పాటుచేశారు. 22 జిల్లాల్లో అనేక క్రీడా నర్సరీలను నెలకొల్పారు. అంబాలాలో భారీ స్టేడియం ఉంది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఏర్పడుతోంది.
పతకం తెచ్చుకో ఉద్యోగం అందుకో
హరియాణాలో కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అలాగే ఉంది. దీంతో చిన్న వయసులోనే క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ సర్కారీ లభిస్తుందన్న విశ్వాసం యువతలో ప్రబలంగా ఉంది. ప్రభుత్వం సైతం పతకాలు తెచ్చుకున్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంతో యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
పతకాల వెల్లువ