టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics 2021) పతకాలు సాధించిన అథ్లెట్లకు నజరానా ఇవ్వాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బంగారు పతకధారులకు రూ.10 లక్షలు.. రజత, కాంస్య పతక విజేతలకు రూ.8 లక్షలు, రూ.5 లక్షల బహుమానంగా ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించింది.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్.. పారాలింపిక్స్‌లో విజేతలను సత్కరించి.. ఆయా రివార్డులను(Rewards For Paralympians) అందజేయనున్నారు. పతకాలు సాధించిన వారితో పాటు వారి కోచ్‌లనూ శుక్రవారం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించనున్నారు.