భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 3 లో రెండో స్థానంలో నిలిచిన అదితి.. ఈ ఈవెంట్లో రజతం సాధించే అవకాశముంది. ప్రస్తుతం మూడు రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది అదితి. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా హన్నా గ్రీన్, న్యూజిలాండ్‌కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు.
చరిత్ర తిరగరాయడానికి అడుగు దూరంలో భారత గోల్ఫర్! - టోక్యో ఒలింపిక్స్
భారత్‌కు మరో పతకం ఖాయం అయ్యే అవకాశముంది. ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న భారత గోల్ఫర్ అదితి అశోక్ రజతం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అదితి
అయితే శుక్రవారం జరగాల్సిన రౌండ్ 4.. వాతావరణ సమస్యల కారణంగా శనివారానికి మార్చారు. ఒకవేళ శనివారం కూడా పోటీలు జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితి అశోక్‌కు రజతం లభిస్తుంది. ఇదే జరిగితే ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్గా అదితి చరిత్ర సృష్టిస్తుంది.
ఇదీ చూడండి:-ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?